Jul 30,2023 07:18

రెండో వన్డేలో టీమిండియాపై విండీస్‌ విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 36.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ 36 , విండీస్‌ కెప్టెన్‌ షై హౌప్‌(63 నాటౌట్‌) మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కీసీ కార్టీ(48) పరుగులతో సత్తా చాటారు. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లతో రాణించగా.. కుల్దీప్‌ యాదవ్‌కు ఒక వికెట్‌ దక్కింది. విండీస్‌ తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బౌలింగ్‌ ఎంచుకోగా, టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. అయితే విండీస్‌ బౌలర్లు విజంభించడంతో భారత్‌ 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (55), శుభ్‌ మాన్‌ గిల్‌ (34) తొలి వికెట్‌ కు 90 పరుగులు జోడించి శుభారంభం అందించినా, మిగతా బ్యాట్స్‌ మెన్‌ విఫలమయ్యారు. మిడిలార్డర్‌ లో సూర్యకుమార్‌ 24 పరుగులు చేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ 16, రవీంద్ర జడేజా 10 పరుగులు చేశారు. సంజు శాంసన్‌ (9), అక్షర్‌ పటేల్‌ 1, తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (7) విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్లలో గుడాకేశ్‌ మోతీ 3, రొమారియో షెపర్డ్‌ 3, అల్జారీ జోసెఫ్‌ 2, జేడెన్‌ సీల్స్‌ 1, యానిక్‌ కరియా 1 వికెట్‌ తీశారు.