అమరావతి: జగన్ ప్రభుత్వంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంపై విమర్శలు గుప్పించారు. కరవుపై చర్చించని మంత్రివర్గ సమావేశం ఎందుకని ప్రశ్నించారు.'వర్షాభావ పరిస్థితులపై సమీక్షించకపోవడం బాధ్యతారాహిత్యం. 400 మండలాల్లో కరవు పరిస్థితులు ఉంటే.. 100 మండలాల్లోనే కరవు ఉందని ప్రభుత్వం ప్రకటించడం దారుణం. వందేళ్లలో ఈ ఏడాదే తక్కువ వర్షపాతమని గణాంకాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లాలో కరవు కారణంగా ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. తప్పుడు కేసుల్లో ప్రతిపక్ష నేతలను ఇరికించడంపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదు. అడ్డగోలు దోపిడీపై తప్ప.. కరవు నివారణ చర్యలపై శ్రద్ధ లేదు. యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని లోకేశ్ అన్నారు.










