Oct 25,2023 21:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక సాధికార బస్సు యాత్రలను జగన్‌ ప్రభుత్వం ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని, దీనివల్ల ఉపయోగం ఏమిటని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు ప్రశ్నించారు. సామాజిక సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ పోలేదని, ఏ ఒక్క పథకమూ అమలు చేయలేదని విమర్శించారు. టిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఎస్‌సి, ఎస్‌టిల కోసం అనేక పథకాలు ఉండేవని, వైసిపి ప్రభుత్వం వాటిని పూర్తిగా తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌ను కులాలవారీగా జగన్‌ వేరు చేశారని విమర్శించారు. జగన్‌ పాలనలో దళిత మంత్రులు, 27 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నా, దళితుల బాగు కోసం ఏ విధంగానూ సహకరించడం లేదన్నారు.