- జైస్వాల్ ఇన్.. సంజు ఔట్..
- నేడు విండీస్‌తో మూడో టి20
- రాత్రి 8.00గం||లకు
గయానా: వెస్టిండీస్‌తో జరిగే మూడు టి20కి యువ క్రికెటర్ జైస్వాల్ చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ స్థానంలో అతడికి తుది జట్టులో చోటు దక్కింది. తొలి రెండు టి20ల్లో ఓటములతో టీమిండియా కాంబినేషన్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. పేలవ బ్యాటింగ్‌తోనే టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. తిలక్ వర్మ మినహా మరే ఆటగాడు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురిలో ఒకరిపై వేటు వేసి యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్‌కు చోటిచ్చే అవకాశమున్నట్లు టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇప్పటికే విండీస్ గడ్డపై టెస్ట్‌ల్లోకి అడుగుపెట్టిన జైస్వాల్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. మూడు మ్యాచ్‌ల్లో అదే జోరును కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే జైస్వాల్‌ను జట్టులోకి తీసుకొస్తే ఓపెనర్ల కాంబినేషన్‌కు తీవ్ర పోటీ నెలకొననుంది. ఈ క్రమంలో ఎవరిని పక్కనపెట్టాలా? అనేది ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. శుభ్‌మన్ గిల్‌ను తప్పిస్తే ఓపెనర్లుగా ఇద్దరూ లెఫ్టాండర్లే ఉండనున్నారు. టి20ల్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనపెడితే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. రెండు మ్యాచ్‌ల్లోనూ సూర్య దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఉన్న ఏకైక ఆప్షన్ సంజూ శాంసన్. లేదంటే పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి సూర్యతో యశస్విని ఓపెనింగ్ చేయించడమే. లేదంటే ఇషాన్ కిషన్‌ను మిడిలార్డర్‌లోకి పంపించి గిల్‌తో కలిసి యశస్వి ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మూడో టీ20లో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే తుది జట్టులో మార్పులు చేయకుండా బరిలోకి దిగాలని హార్దిక్ పాండ్యా భావిస్తే మాత్రం అతనికి మరోసారి నిరాశే ఎదురుకానుంది. కుల్దీప్ గాయం నుంచి కోలుకుంటే జట్టులోకి వస్తాడు. అప్పుడు బిష్ణోరు ఉద్వాసనకు గురవుతాడు. ముకేష్ కుమార్‌ను పక్కనపెట్టాలనుకుంటే ఉమ్రాన్ మాలిక్, ఉనాద్కత్‌ల్లో ఒకరు తుది జట్టులోకి వస్తారు.
జట్టు(అంచనా): జైస్వాల్, శుభ్‌మన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్, అక్షర్ పటేల్, బిష్ణోరు, అర్ష్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్, చాహల్/ఉనాద్కత్.










