బార్బడోస్: తొలి వన్డేలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ దెబ్బకు విండీస్ జట్టు కుదేలయ్యింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలిగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్లు తమపై ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయక విండీస్ బ్యాటర్స్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్(4/6), జడేజా(3/37) స్పిన్ మాయాజాలానికి తోడు ముఖేశ్, శార్దూల్, హార్దిక్ ఒక్కో వికెట్ పడగొట్టారు. వన్డేల్లో భారత్ చేతిలో విండీస్ జట్టుకు ఇది రెండో అత్యల్ప స్కోర్. అంతకుముందు 2018లో తిరువనంతపురంలో విండీస్ జట్టు 104పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్, వికెట్ కీపర్ షారు హోప్(43) టాప్ స్కోరర్, అథంజే(22), కింగ్(17), హెట్‌మెయిర్(11) రెండంకెల స్కోర్ చేశారు.
- వన్డే ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగానే..: రోహిత్ శర్మ
ఐసిసి వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఓవైపు ప్రయోగాలు చేస్తూనే మరోవైపు విజయాల కోసం కృషి చేస్తామని, ఈ క్రమంలోనే విండీస్‌తో తొలి వన్డేకు నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందన్నాడు. అక్షర్ పటేల్‌కు బదులు శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. గాయంతో జట్టుకు దూరమైన మహమ్మద్ సిరాజ్ స్థానంలో ముకేష్ కుమార్ అరంగేట్రం చేయనున్నాడని, వన్డే ప్రపంచకప్‌కు ముందు ప్రతి సిరీస్ ముఖ్యమైనేదనని అన్నాడు. ఇక వెస్టిండీస్ కెప్టెన్ షారు హోప్ మాట్లాడుతూ.. ప్రతి మ్యాచ్, సిరీస్ గెలవాల్సిందేనని, టాప్ టీమ్‌పై ఆడే అవకాశం దక్కిందని, తమ జట్టులో క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారని తెలిపాడు. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేయడమే తమ లక్ష్యమని, తమ అవకాశాలను అందిపుచ్చుకుంటామని అన్నాడు. ఒషానే థామస్, అల్జారీ జోసెఫ్, కెవిన్, కీసీ కార్టీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారన్నాడు.
స్కోర్‌బోర్డు..
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (బి)శార్దూల్ 17, మయర్స్ (సి)రోహిత్ (బి)హార్దిక్ 2, అథంజే (సి)జడేజా (బి)ముఖేశ్ కుమార్ 22, హోప్ (ఎల్‌బి)కుల్దీప్ 43, హెట్‌మెయిర్ (బి)జడేజా 11, రుమన్ పావెల్ (సి)శుభ్‌మన్ (బి)జడేజా 4, షెఫర్డ్ (సి)కోహ్లి (బి)జడేజా 0, డ్రాక్స్ (ఎల్‌బి)కుల్దీప్ 3, యన్నిక్ కరియా (ఎల్‌బి) కుల్దీప్ 3, జి. మోటీ (నాటౌట్) 0, జడేన్ సెలెస్ (సి)హార్దిక్ (బి)కుల్దీప్ 0, అదనం 9. (23ఓవర్లలో ఆలౌట్) 114పరుగులు.
వికెట్ల పతనం: 1/7, 2/45, 3/45, 4/88, 5/96, 6/96, 7/99, 8/107, 9/114, 10/114
బౌలింగ్: హార్దిక్ పాండ్యా 3-0-17-1, ముఖేష్ కుమార్ 5-1-22-1, శార్దూల్ ఠాకూర్ 3-1-14-1, రవీంద్ర జడేజా 6-0-37-3, ఉమ్రన్ మాలిక్ 3-0-17-0, కుల్దీప్ 3-2-6-4










