Jul 26,2023 22:00
  • ఎవరికి చోటు దక్కేనో..
  • నేడు వెస్టిండీస్‌తో తొలి వన్డే

బ్రిడ్జ్‌టౌన్‌: వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న భారతజట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. వికెట్‌ కీపర్ల కోటాలో సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లలో ఎవరికి చోటు దక్కనుందో మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. టెస్టుల్లో చోటు దక్కించుకున్న ఇషాన్‌ కిషన్‌ రెండో టెస్ట్‌లో అర్ధశతకంతో మెరిసాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో తొలి వన్డేలో గురువారం తలపడనుంది. ఈ పర్యటనల అనంతరం భారత జట్టు ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌తో బిజీగా గడపనుంది. వన్డే స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌తోపాటు స్పిన్నర్‌ చాహల్‌, ఉపేసర్‌ ఉమ్రన్‌ మాలిక్‌కు చోటు దక్కే అవకాశముంది. శ్రేయస్‌ అయ్యర్‌ గాయంతో జట్టుకు దూరమైన నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ టి20, వన్డేల్లో చోటు దక్కించుకొని అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో హ్యాట్రిక్‌ డక్‌లతో నిరాశపరిచిన సూర్యకుమార్‌ యాదవ్‌.. కేవలం టి20లకే సరిపోతాడనే నానుడినుంచి బయటపడాలంటే విండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రాణించాల్సిన అవసరమెంతైనా ఉంది.
జట్లు..
భారత్‌:
రోహిత్‌(కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌, గైక్వాడ్‌, కోహ్లి, సైర్యకుమార్‌, సంజు, ఇషాన్‌, శార్దూల్‌, జడేజా, అక్షర్‌, చాహల్‌, కుల్దీప్‌, ఉనాద్కట్‌, సిరాజ్‌, ఉమ్రన్‌, ముఖేశ్‌ కుమార్‌,
వెస్టిండీస్‌: హోప్‌(కెప్టెన్‌), రుమన్‌ పావెల్‌(వైస్‌ కెప్టెన్‌), అథనజే, యన్నిక్‌ కర్రీ, కర్టీ, డ్రాక్స్‌, హెట్‌మైర్‌, జోసెఫ్‌, కింగ్‌, మయర్స్‌, మోటీ, సిలెస్‌, షెఫర్డ్‌, సింక్లేయిర్‌, థామస్‌.