గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. విండీస్ జట్టులో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 45, కైల్ మేయర్స్ 25 పరుగులు చేసి శుభారంభం చేసిన ఆ తర్వాత వచ్చిన నికోలాస్ పూరన్ 20, జాన్సన్ చార్లెస్ (12) లను అవుట్ చేసి విండీస్ జోరుకు కళ్లెం వేశాడు. చివర్లో కెప్టెన్ రోవ్ మాన్ పావెల్ ధాటిగా ఆడడంతో విండీస్ స్కోరు 150 మార్కు దాటింది. పావెల్ 19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 1, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు.










