Aug 03,2023 13:16

ప్రజాశక్తి - వేంపల్లె(కడప) : వేంపల్లెలోని ఆర్టీసీ బస్టాండు రూపు రేఖలను మారుస్తామని కడప ఎంపీ వ్కెఎస్‌ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ పునర్నిర్మాణం కోసం కడప ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ దుగ్గాయపల్లి మల్లిఖార్జున రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ అమర్నాథ్‌ రెడ్డిలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపి అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీకి చెందిన రూ.302 లక్షల నిధులతో ఆర్టీసీ బస్టాండును అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కూడ ఆర్టీసీ బస్టాండులో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ బస్టాండును పునర్నిర్మాణం చేపట్టుతున్నట్లు తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ అమర్నాథ్‌ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ దుగ్గాయపల్లి మల్లిఖార్జున రెడ్డి, పులివెందుల ఒఎస్టీ అనిల్‌ కుమార్‌ రెడ్డి, ఆర్టీసీ జోనల్‌ ఇడి వెంకటేశ్వరరావు, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ గోపాల్‌ రెడ్డి, జడ్పీటీసీ రవికుమార్‌ రెడ్డి, సర్పంచ్‌ రాచినేని శ్రీనివాసులు, ఎంపిపి లక్ష్మి గాయత్రీ, ఎపిఐఐసి డైరెక్టర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి, సివిల్‌ సప్లరు డైరెక్టర్‌ షబ్బీర్‌ వలి, కాణిపాకం దేవస్థానం డైరెక్టర్‌ గోగుల కోండయ్య, ఎంపిటిసిలు భారతి, రాజ్‌ కుమార్‌, కటిక చంద్ర శేఖర్‌, వైసిపి మండల యూత్‌ కన్వీనర్‌ రవిశంకర్‌ గౌడ్‌, మాజీ సర్పంచ్‌ ప్రసాద్‌ రెడ్డి, పులివెందుల ఆర్టీసీ డిపో మేనేజర్‌ రామకృష్ణ, ఆర్టీసి ఇఇ శ్రీనివాస్‌, పొద్దుటూరు డిపో మేనేజర్‌ ఎఎం రెడ్డితో పాటు వైసిపి నాయకులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.