ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తీరును ఖండిస్తున్నామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. గురువారం నాడిక్కడ సిపిఎం కేంద్ర కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియాతో సీతారాం ఏచూరి మాట్లాడారు. 'మా పార్టీ... చంద్రబాబును ఏ రకంగా అరెస్టు చేశారో ఆ తీరును తీవ్రంగా ఖండించింది. ఇన్నేళ్లూ ఏమీ అనని వారు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి.. ఇంకా మూడు నెలలు ఉన్నాయన్నప్పుడు ఈ చర్యలు తీసుకున్నారు. కేసు మెరిట్స్ వేరే సంగతి, అరెస్టు చేసిన తీరు, అరెస్టు చేసే సమయాన్ని ప్రశ్నిస్తున్నాం. కేసులో 37 మంది ఉంటే ప్రత్యేకంగా చంద్రబాబును అరెస్టు చేశారు. ముఖ్యంగా ఆ తీరును ఖండిస్తున్నాం.' అని అన్నారు.










