తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తమ ఉద్దేశమని, వైఎస్‌ఆర్‌టిపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని షర్మిల పిలుపునిచ్చారు. '' కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడటం సరికాదు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తాం. మేం పోటీ చేయడం లేదు '' అని షర్మిల వెల్లడించారు.










