Jun 11,2023 13:52

మనకు నీరు ఎంతున్నా, ఉపయోగపడేది కొంత మాత్రమే. ఫలితంగా నీటి కొరత మనల్ని ఇంకా వేధిస్తున్న సమస్యే. ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నీటి కొరతను అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే శుద్ధిచేసిన జలాన్ని అందించేందుకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు ఒక కొత్త పోర్టబుల్‌ థర్మల్‌ డీశాలినేషన్‌ వ్యవస్థను అభివద్ధి చేశారు. ఈ విధానంలో నీటిని మొదట ఆవిరిగా మారుస్తారు. ఆ తర్వాత అందులోని ఉప్పు, ఇతర మలినాలను తొలగిస్తారు. ఆ తర్వాత ఆవిరిని ఘనీభవింపచేసి శుద్ధ జలాన్ని సేకరిస్తారు. పెద్దపెద్ద రిజర్వాయర్లు, సముద్రపు నీరు, ఉప్పునీటి కయ్యల్లోని నీరు, భూగర్భ జలాలను ఈ విధానంలో శుద్ధి చేయొచ్చని ఐఐఎస్‌సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుస్మితాదాస్‌ తెలిపారు. రోజులో సూర్యుడి గమనాన్ని బట్టి డీశాలినేషన్‌ యూనిట్‌ను మార్చుకునేలా డిజైన్‌ చేసినట్టు ఆమె వివరించారు.

వ్యవస్థలు ఉప్పునీటిని వేడి చేయడం ద్వారా పనిచేస్తాయి. ఆ తర్వాత ఏర్పడే ఆవిరిని ఘనీభవించి, మంచినీటిని పొంది, స్వచ్ఛమైన తాగునీటి లభ్యతను పెంచడానికి సాధ్యమయ్యే చక్కని పరిష్కారం.
           స్వచ్ఛమైన తాగునీటి లభ్యతను పెంచడానికి సాధ్యమైన పరిష్కారంగా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (××ూష) పరిశోధకులు సౌరశక్తితో పని చేయగల ఈ కొత్త థర్మల్‌ డీశాలినేషన్‌ సిస్టమ్‌ను అభివద్ధి చేశారు. డీశాలినేషన్‌ కోసం అత్యంత సాధారణ పద్ధతులు మెమ్బ్రేన్‌ ఆధారిత రివర్స్‌ ఆస్మాసిస్‌, థర్మల్‌ డీశాలినేషన్‌. అయితే, ఈ రెండు పద్ధతులూ చాలా శక్తిని వినియోగిస్తాయి.
 

                                                                    పర్యావరణ అనుకూలం..

'సాధారణంగా బాష్పీభవనానికి అవసరమైన శక్తి విద్యుత్‌ లేదా శిలాజ ఇంధనాల ద్వారా వస్తుంది. పర్యావరణ అనుకూలతకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తిని ఉపయోగించడం జరిగింది. ఈ విధానంలో పెద్ద రిజర్వాయర్‌లలోని ఉప్పునీటిని ఆవిరి చేయడానికి సౌరశక్తిని వినియోగిస్తారు. పైకప్పుపై ఘనీభవించే పారదర్శక ఆవిరిని సేకరిస్తారు. ఘనీభవన సమయంలో పైకప్పుపై నీటి యొక్క పలుచని పొర ఏర్పడుతుంది. ఇది రిజర్వాయర్‌లోకి చొచ్చుకుపోయే సౌరశక్తిని తగ్గిస్తుంది. అందువల్ల వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది' అని  IISc  తెలిపింది.
         సుస్మితాదాస్‌, ఆమె పీహెచ్‌డీ విద్యార్థి నబజిత్‌ దేకా రూపొందించిన సెటప్‌లో తయారైనది ఈ సెలైన్‌ వాటర్‌ రిజర్వాయర్‌. ఆవిరి పోరేటర్‌, పరిసర గాలికి వేడి వల్ల కలిగే నష్టాలను నివారించడానికి ఇన్సులేటింగ్‌ చాంబర్‌లో కండెన్సర్స్‌ ఉన్నాయి. ఈ వ్యవస్థ సౌరశక్తిని ఉపయోగించి, ఒక చిన్న పరిమాణంలో నీటిని పీల్చుకున్నా ఆవిరి పోరేటర్‌లోకి చేరి, ఆవిరైపోతుంది, ఆవిరి పోరేటర్‌లోకి ద్రవం వికింగ్‌ మైక్రోస్కేల్‌ అల్లికల యొక్క కేశనాళిక ప్రభావాన్ని ఉపయోగించుకుంటుంది.
          'ఈ ప్రభావంత ద్రవాలను పోరస్‌ పదార్థం యొక్క ఇరుకైన ప్రదేశాలలోకి లాగడానికి అనుమతిస్తుంది. నీరు స్పాంజి ద్వారా గ్రహించినట్లు. ఈ విధానాన్ని ఉపయోగించడం వలన, రిజర్వాయర్‌లోని మొత్తం ద్రవ పరిమాణాన్ని వేడి చేయడానికి బదులుగా, సిస్టమ్‌ యొక్క శక్తి సామర్థ్యంలో గణనీయమైన మెరుగుదల ఏర్పడుతుంది' అని సుస్మితా దాస్‌ చెప్పారు.
 

                                                                    భూగర్భ జలాల కోసమూ..

సముద్రపు నీరే కాకుండా, నీటిలో కరిగిన లవణాలు, ఉప్పునీటితో కూడిన భూగర్భ జలాలలోనూ ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది పగటిపూట సూర్యుని యొక్క షిఫ్టింగ్‌ స్థానాలకు అనుగుణంగా సర్దుబాటు చేయబడుతుంది. ఎందుకంటే దీనికి సౌరశక్తిని వినియోగించడమే కారణం.
పరిశోధకులు ప్రస్తుతం ఈ వ్యవస్థను స్కేలింగ్‌ చేయడం, మన్నికను మెరుగుపరచడం కోసం మరింత కృషి చేస్తున్నారు. అంతేకాదు ఈ పద్ధతిలో ఉత్పత్తి చేసే తాగునీటి పరిమాణాన్ని పెంచడంపైనా పని చేస్తున్నారు. తద్వారా దీనిని గహ, వాణిజ్య అవసరాలకు వినియోగించవచ్చని ××ూష తెలిపింది.