Aug 14,2023 16:32
  • పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలోనూ ఈ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్టయిన్‌ మెంట్‌ ఈవెంట్‌ కు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. హైదరాబాదులో నిర్వహించే ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్‌ పేరు సూపర్‌ స్టార్‌ స్పెక్టాకిల్‌-2023 అని శ్రీనివాస్‌ గౌడ్‌ ట్విట్టర్‌ లో వెల్లడించారు. సెప్టెంబరు 8న గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో ఈ ఈవెంట్‌ జరగనుందని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఈ పురుషుల వరల్డ్‌ హెవీ వెయిట్‌ చాంపియన్‌ సేత్‌ ఫ్రాంక్లిన్‌ రోలిన్స్‌, మహిళల వరల్డ్‌ చాంపియన్‌ రియా రిప్లేతో పాటు డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్‌ టీమ్‌ చాంపియన్స్‌ సమీ జేన్‌, కెవిన్‌ ఓవెన్స్‌... ఇంటర్‌ కాంటినెంటల్‌ చాంపియన్‌ ది రింగ్‌ జనరల్‌ గుంతర్‌, జిందర్‌ మహల్‌, వీర్‌, సంగా, డ్రూ మెకింటైర్‌, బెకీ లించ్‌, నటాల్యా, మాట్‌ రిడిల్‌, లుడ్విగ్‌ కైజర్‌ తదితర డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్లు హైదరాబాదుకు రానున్నారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు.

wwe