మంథని: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ఓటేసే ముందు బాగా ఆలోచించి వేయాలని బిఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంథనిలో నిర్వహించిన బిఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గని కేసీఆర్ మాట్లాడారు. పార్టీ అభ్యర్థి పుట్ట మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.''జనం గెలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలి. పార్టీల చరిత్రలు చూసి ఓటేయాల్సిన అవసరం ఉంది. గిరిజన, ఆదివాసీల విషయంలో కాంగ్రెస్ సరైన విధానాలను అవలంబించలేదు. పీవీ మొదలుపెట్టిన రింగ్‌రోడ్డును పుట్ట మధు పూర్తి చేశారు'' అని కేసీఆర్ తెలిపారు. రూ.1000 కోట్ల ప్రత్యేక నిధితో మంథని నియోజకవర్గాన్ని అభివఅద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్య ఐక్యత లోపిస్తోందని, అందరూ కలిసి పనిచేస్తేనే అభివఅద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. '' బీసీ బిడ్డను గెలిపించాలని మంథని ప్రజలతో పంచాయతీ పెట్టుకుంటా. అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి'' అని కేసీఆర్ అన్నారు.










