Nov 04,2023 14:57

తిరుమల: ఏడాదికి ఒక్కసారి మాత్రమే కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం కుటుంబసభ్యులతో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్య ఆపై మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించడం ఎంతో తఅప్తిని కలిగించిందన్నారు. దేశం అన్ని విధాల అభివఅద్ధి చెందాలని.. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు. శ్రీవారి సన్నిధిలో ఎవరు కూడా రాజకీయాల ప్రస్తావన తీసుకురాకూడదని తెలిపారు. ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ పొందిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడకూడదని తాను నిర్ణయం తీసుకున్నట్లు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.