ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలోని పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పరిశీలన కోసం జిల్లాలకు విచ్చేసిన సందర్భంగా మంగళవారం కర్నూలు కోడుమూరు నియోజకవర్గ మాజీ టిడిపి మాజీ ఇంచార్జి డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు గార్గేయపురం వద్ద ఆయనకు గజమాలతో పూల బొకేలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ టిడిపి యువ నాయకులు బొగ్గుల దస్తగిరి, పంచలింగాల సర్పంచు కృష్ణ యాదవ్, బి.తాండ్రపాడు సర్పంచ్ జయన్న, తులసి పురం సర్పంచ్ గిడ్డయ్య, మాజీ జడ్పిటిసి చంద్రశేఖర్ పోలకల్ సర్పంచ్ దేవరాజు, గూడూరు కౌన్సిలర్లు సురేష్, విజరు, శేషావలి, నాగలాపురం సర్పంచ్ సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










