సచిన్‌ను అధిగమించిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించారు. విండీస్‌తో తొలి టెస్టులో సెంచరీ మిస్ చేసుకున్న భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ... రెండో టెస్టులో అదరహో అనిపించారు..! సచిన్ తన సుదీర్ఘ కెరీర్‌లో 664 మ్యాచులు ఆడారు. ఇందులో వంద శతకాలు, 201 వికెట్లు ఉన్నాయి. అయితే విరాట్ తన 500వ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సఅష్టించారు. విరాట్ కంటే ముందు మరో తొమ్మిది మంది ఆటగాళ్లు మాత్రమే 500 మ్యాచ్‌ల క్లబ్‌లో ఉన్నారు. భారత ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. కానీ వారెవరూ తమ మైలురాయి మ్యాచ్‌లో సెంచరీ సాధించలేదు. ఆ ఘనత విరాట్ కే దక్కింది. సచిన్ 35 పరుగులు, ధోనీ 32లి (టీ20), రాహుల్ ద్రవిడ్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.
76కి చేరిన శతకాల సంఖ్య...
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (121) సూపర్ సెంచరీ సాధించారు. టీమ్‌ఇండియా తరఫున విరాట్ కోహ్లీకిది 500వ అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. విండీస్ - భారత్ జట్ల మధ్య 100వ టెస్టు కావడం విశేషం. ఈ క్రమంలో విరాట్ టెస్టుల్లో 29వ సెంచరీ నమోదు చేశారు. దీంతో అన్ని ఫార్మాట్లు కలిపి శతకాల సంఖ్య 76కి చేరింది.
అనుష్క స్పెషల్ పోస్టు..
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ 76వ శతకం సాధించిన సందర్భంగా ... అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రత్యేక పోస్టు పెట్టారు. విరాట్ సెంచరీ తర్వాత అభివాదం చేస్తున్న సమయంలో తీసిన ఫొటోపై లవ్ సింబల్ ఉంచి షేర్ చేశారు. విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ కూడా దీటుగా స్పందిస్తోంది. ప్రస్తుతం 86/1 స్కోరుతో నిలిచింది.










