ప్రజాశక్తి- దేవనకొండ (కర్నూలు) : మూడు మాసాలుగా మణిపూర్‌లో జరుగుతున్న హింస, అల్లర్లు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.వీరశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి అశోక్‌లు డిమాండ్ చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసకాండను నిరసిస్తూ ప్రజాసంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు యూసఫ్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా రావణకాష్టంల మణిపూర్ మండిపోతున్న ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం పెద్దలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసకాండకు బాధ్యత కేంద్ర ప్రభుత్వమే వహించాలని పేర్కొన్నారు. మతోన్మాదులు, గిరిజన సంపదపై కన్నేసిన పెట్టుబడిదారుల లాభాపేక్ష ఫలితంగా అల్లర్లు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడిని అందరూ ఖండించాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది మణిపుర్‌కే పరిమితం కాదని దేశవ్యాప్తంగా ప్రణాళిక బద్ధం ప్రకారం మతోన్మాదులు ఇట్లాంటి చర్యలు కోరుకుంటున్నారని విమర్శించారు. మహిళలను నగంగా ఊరేగింపు చేసి వారిపైన అత్యాచారాలకు పాల్పడిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రమేష్, పల్లె దొడ్డి నాగేష్, మహీంద్రా, పెద్దయ్య, రాము, కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.










