న్యూఢిల్లీ : రాజస్థాన్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె విధేయుడు కైలాష్ మేఘ్వాల్ (89)ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బిజెపి సస్పెండ్ చేసింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నెంబర్ 1 అవినీతిపరుడని, ఆయన్ని కేంద్ర క్యాబినెట్ నుంచి తప్పించాలని మేఘ్వాల్ ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. కైలాష్ గతంలో రాజస్థాన్ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. రాష్ట్రంలోని చురా జిల్లాలో అధికారిగా పనిచేసినప్పుడు అర్జున్ కోట్లాది రూపాయలను ముడుపులుగా పుచ్చుకున్నాడని గత నెలలో ఆరోపించారు. రాజస్థాన్ శాసనస భకు డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయని, పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అంతర్గత కుమ్ములాటలు జరు గుతున్నాయని కైలాష్ తెలిపారు. అర్జున్ వ్యవహారంపై ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశానని, ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కూడా కోరతానని చెప్పారు. రాబోయే శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, బిజెపి అభ్యర్థిని వేలాది ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని తెలిపారు.










