మంచిర్యాల: భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్యాంపటేల్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శ్రావణ్‌పల్లికి చెందిన సరిత (25), జెండావెంకటా పూర్‌కు చెందిన గొడిసెల స్వామి ఆరేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. కొంతకాలంవారి దాంపత్య జీవితం సజావుగా సాగింది.ఏడాది క్రితం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యను అనుమానించడంతో పాటు వరకట్నం తేవాలని వేధిస్తుండేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరగగా సరిత ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన స్వామి వెంటనే ఆటోలో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మఅతురాలి తండ్రి మాలోతు జిత్తు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.










