Sep 17,2023 09:44

ఏలూరు రూరల్‌ : గేదెను తప్పించబోయి ట్రక్‌ ఆటో బోల్తాపడటంతో డ్రైవర్‌ మృతి చెందిన ఘటన ఆదివారం ఏలూరు రూరల్‌లో జరిగింది. ఏలూరు నుండి కైకలూరు వైపు పండ్ల లోడుతో వెళుతున్న ట్రక్‌ ఆటోకు కైకలూరు రోడ్డు, శ్రీపర్రు హై స్కూల్‌ సమీపంలో గేదె అడ్డు వచ్చింది. గేదెను తప్పించడానికి డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో ట్రక్‌ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందాడు. ఘటనా స్థలానికి ఏలూరు రూరల్‌ పోలీసులు చేరుకున్నారు. మృతుడు ఏలూరు బావిశెట్టివారిపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ కోలా దీపక్‌ కుమార్‌ (40)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.