Aug 01,2023 20:43

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత డబుల్స్‌ జోడీకి మిశ్రమ ఫలితాలు దక్కాయి. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌ తొలిరౌండ్‌ పోటీలో త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్‌ జంట రెండోరౌండ్‌కు దూసుకెళ్లగా.. సిక్కిరెడ్డి-ఆరతి, అస్విని పొన్నప్ప-తానీషా జోడీ తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ 17వ ర్యాంక్‌ జోడీ అయిన త్రీసా-గాయత్రి 21-16, 21-17తో కెనడాకు చెందిన ఛోరు-వురుపై వరుససెట్లలో గెలుపొందారు. ఇక సిక్కిరెడ్డి-ఆరతి జోడీ 14-21, 17-21తో చైనీస్‌ తైపీ జంట చేతిలో, తానీషా-అశ్విని పొన్నప్ప జోడీ 11-21, 21-14, 17-21తో ఇండోనేషియాకు చెందిన కుసుమ-ప్రథ్వీ చేతిలో పోరాడి ఓడారు. బుధవారం నుంచి సింగిల్స్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి.