ప్రజాశక్తి -పెద్దకడబూరు(కర్నూలు) : పెద్దకడబూరు మండలంలోని చిన్న తుంబలం గ్రామానికి చెందిన వీఆర్‌ఏ గోవింద్ గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం సిపిఎం మండల కార్యదర్శి కన్నా, విఆర్‌ఏలు భీమన్న, నాగరాజు, నరసింహులు, హుసేని, రమేష్, వీరేష్, హనుమంతు, రోగెన్న, లక్ష్మన్న, గోపాల్ గోవిందు మతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వీఆర్‌ఏల సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.










