Nov 01,2023 22:03

క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర్ర అవతరణ దినోత్సం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ 67వ అవతరణ దినోత్సవం సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. భాషా, సాంస్కృతికశాఖ సంచాలకులు ఆర్‌ మల్లికార్జునరావు రచించిన స్వాతంత్య్ర ఉద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఆర్‌కె రోజా, ఉషశ్రీ చరణ్‌, సిఎస్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గన్నారు.

  • రేపు విశాఖ పర్యటన

ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ కాంగ్రెస్‌ ప్లీనరీ ప్రారంభోత్సవంలో పాల్గనేందుకు గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు. రుషికొండ రాడిసన్‌ బ్లూహోటల్లో జరిగే ఈ కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.