ప్రజాశక్తి-ఆదోనిరూరల్(కర్నూలు) : ప్రతి ఉద్యోగికి బదిలీలు సహజమని మండల పరిషత్ కన్నడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముకప్ప అన్నారు. శనివారం మండలం పరిధిలోని పెద్దహరివనం గ్రామంలో కన్నడ పాఠశాలలో గతంలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించిన నాగేశప్ప వీడ్కోలు సభ ప్రధానోపాధ్యాయులు ముకప్ప అధ్యతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల నుండి బదలీ అయిన ఉపాధ్యాయులను, గ్రామస్తులు, విద్యార్థులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అదేవిధంగా ఈ పాఠశాలకు బదిలీలో నూతనం వచ్చిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ తిప్పన్న, వీరశ్రీ, జంబునాత ఉపాధ్యాయ బృందం పాల్గొంది.










