న్యూఢిల్లీ : వచ్చే ఏడాది తమిళనాడులో నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడలకు శిక్షణ పొందేందుకు మణిపూర్ క్రీడాకారులను తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ ఆహ్వానించారు. మణిపూర్‌లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఆదేశించినట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల రాష్ట్రం ఆందోళన చెందుతోందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రం ప్రపంచస్థాయి క్రీడాకారులకు, ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు పేరుగాంచిందని తెలిపారు. శిక్షణ తీసుకోవాలనుకుంటున్న మణిపూర్ క్రీడాకారులు తమ పేర్లు, చిరునామాలు, ఐడెంటిటీ ప్రూఫ్‌లతోరజూశీత్‌ీర్‌అ2023ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ లేదా +91 8925903047 లకు సంప్రదించాలని సూచించారు. తమిళనాడు స్పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా శిక్షణ పొందవచ్చునని చెప్పారు.










