Nov 09,2023 11:34

హైదరాబాద్‌ : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో హైవే విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదలడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి సుమారు 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. ఈ నేషనల్‌ హై వే పై వాహనాలన్నీ నిదానంగా కదులుతున్నాయి.