Aug 14,2023 22:29

టొరంటో: టొరంటో మాస్టర్స్‌-1000 టైటిల్‌ను జెన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ) చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో సిన్నర్‌ 6-4, 6-1తో అలెక్స్‌ డి-మినార్‌(ఆస్ట్రేలియా)పై వరుససెట్లలో నెగ్గాడు. దీంతో 2017లో 20ఏళ్లకు ఈ టైటిల్‌ నెగ్గిన అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ తర్వాత 21ఏళ్లకు ఈ టైటిల్‌ను నెగ్గిన మరో యువ ఆటగాడు సిన్నర్‌ మాత్రమే.

రూనే, సిన్నర్‌ ర్యాంకులు మెరుగు

తాజా ఏటిపి ర్యాంకింగ్స్‌లో జెన్నిక్‌ సిన్నర్‌, హోల్జర్‌ రూనే ర్యాంక్‌ మెరుగైంది. అంతర్జాతీయ టెన్నిస్‌ ఫెడరేషన్‌(ఏటిపి) సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో రూనే(డెన్మార్క్‌) 4790పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకగా.. టొరంటో టైటిల్‌ విజేత, ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌ 4725పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. టొరంటో సెమీస్‌కు టాప సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ను ఓడించిన టామీ పాల్‌(అమెరికా) 13వ స్థానంలో నిలువగా.. అలెగ్జాండ్రో 123వ స్థానం నుంచి 14వ స్థానానికి ఎగబాకాడు.
ఏటిపి టాప్‌-10 ర్యాంకింగ్స్‌..
1. అల్కరాజ్‌(స్పెయిన్‌) : 9395పాయింట్లు
2. నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా) : 8795 ,,
3. డానియేల్‌ మెద్వదెవ్‌(రష్యా) : 6530 ,,
4. స్టెఫొనాస్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌) : 5090 ,,
5. హోల్జర్‌ రూనే(డెన్మార్క్‌) : 4790 ,,
6. జన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ) : 4725 ,,
7. కాస్పర్‌ రూఢ్‌(నార్వే) : 4715 ,,
8. ఆండీ రుబ్లేవ్‌(రష్యా) : 4595 ,,
9. టేలర్‌ ఫ్రిట్జ్‌(అమెరికా) : 3605 ,,
10. ఫ్రాన్సెస్‌ టఫీ(అమెరికా) 3050 ,,