హైదరాబాద్: ఇబ్రహీంపట్నంలోని కర్నంగూడ కాల్పుల కేసులో ముగ్గురు నిందితులను రంగారెడ్డి జిల్లా కోర్టు దోషులుగా తేల్చింది. మట్టారెడ్డి, ఖాజా మొయినుద్దీన్, భిక్షపతిలకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 2022 మార్చి 1న కర్నంగూడలోని వ్యవసాయ పొలంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఘటనాస్థలంలోనే మఅతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భూవివాదాల కారణంగానే జంట హత్యలు జరిగినట్టు గుర్తించారు.శ్రీనివాస్‌రెడ్డితో ఉన్న భూ వివాదం కారణంగానే మట్టారెడ్డి.. తన వద్ద పనిచేసే ఖాజా మొయినుద్దీన్, భిక్షపతిని హత్యకు ప్రేరేపించాడు. దీంతో వారిద్దరూ దేశవాళి తుపాకీలతో శ్రీనివాస్‌రెడ్డి, అతని అనుచరుడు రాఘవేందర్‌రెడ్డిని కాల్చి చంపినట్టు పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. ప్రధాన నిందితుడు మట్టారెడ్డితో పాటు కాల్పులు జరిపిన ఖాజా మొయినుద్దీన్, భిక్షపతిని అదే నెల 3న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో పూర్తి ఆధారాలతో పాటు సాక్షులను ప్రవేశపెట్టారు. విచారణ నిర్వహించిన కోర్టు ముగ్గురినీ దోషులుగా తేల్చి.. జీవితఖైదు విదిస్తూ తీర్పు ఇచ్చింది.










