ఆసియా కప్ 2023 గ్రూప్ మ్యాచులు ముగిశాయి. గ్రూప్ ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్ సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించగా, గ్రూప్ బీ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక క్వాలిఫై అయ్యాయి. సెప్టెంబర్ 6న లాహౌర్‌లో పాకిస్తాన్ - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ తర్వాత 2 రోజుల బ్రేక్ దొరుకుతుంది. టీమ్స్ అన్నీ కొలంబో చేరుకుంటాయి. సెప్టెంబర్ 9న బంగ్లాదేశ్ -శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. సెప్టెంబర్ 10న ఇండియా -పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత 11 తేదీ బ్రేక్ తీసుకుని, 12న శ్రీలంక-టీమిండియా మ్యాచ్ జరుగుతుంది. సెప్టెంబర్ 14న శ్రీలంక- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. సెప్టెంబర్ 15న ఇండియా - బంగ్లాదేశ్ మధ్య ఆఖరి సూపర్ 4 మ్యాచ్ జరుగుతుంది. సూపర్ 4 స్టేజీలో టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.










