మనుషుల్లో ట్రాన్స్‌జెండర్స్ ఉంటారుగానీ, ఈ పక్షుల్లో ఉండటమేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యం ఏమీ లేదు.. ఇది వాస్తవమే. పెన్సిల్వేనియాకు చెందిన ఒక పక్షుల ఫోటోగ్రాఫర్ ఆడ, మగ లక్షణాలు రెండూ ఉన్న ఒక పక్షిని గుర్తించారు. ఆ పక్షిపేరు నార్తర్న్ కార్డినల్. ఇలాంటి పక్షులు చాలా అరుదుగా కనిపిస్తాయి. 'వీటిలో మగ కార్డినల్ పక్షులు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఆడ పక్షులు లేత గోధుమ రంగులో ఉంటాయి. కానీ, ఇలా ఆడామగా రెండు లక్షణాలున్న పక్షులు కనిపించడం అరుదు' అని రిటైర్డ్ పక్షి శాస్త్రవేత్త జేమీహిల్ చెప్పారు.
మొదట్లో ఈయన పక్షి ఈకల్లో ఏర్పడిన పిగ్మెంటేషన్ వలన అలా అయిందేమోనని భావించారు. కానీ. మొబైల్ ఫోనులో తీసిన ఫోటోలను చూసిన తర్వాత ఇది గ్యాన్డ్రోమోర్ఫిజం అనే లక్షణం అని నిర్ధారించుకున్నారు. అలాంటప్పుడే పక్షికి అండాశయాలు, వృషణాలు కూడా ఉంటాయి. ఈ భాగాలు పని చేస్తాయి కూడా.
ఈ కార్డినల్ పక్షి కనిపించిన ఇంటికి ఆయన వెళ్లారు. ఆ విచిత్రమైన పక్షిని ఆయన వెళ్లిన గంటలోనే చిత్రీకరించగలిగారు.
'నేను ఆ చిత్రాలను తీసిన తర్వాత నా గుండె మరో ఐదు గంటల పాటు వేగంగా కొట్టుకుంటూనే ఉంది. నేను ఇంటికి తిరిగి వచ్చి, ఆ ఫోటోలన్నింటినీ చూసేవరకు అదే స్థితి కొనసాగింది' అని హిల్ వివరించారు.
'నేను రెండు దశాబ్దాల నుంచి అంతరించిపోయిన ఐవరీ బిల్డ్ ఉడ్‌పెకర్ కోసం వెతుకుతున్నాను. చాలా సాధారణంగా ఇంటి వెనకాల కనిపించే ఈ పక్షిని చిత్రీకరించడం నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. అది చూస్తున్నప్పుడు నాకు ఉడ్‌పెకర్ దొరికినట్లు అనిపించింది' అని చెప్పారు.
'ఆడ, మగ లక్షణాలతో ఉండే పక్షులు ఉండటం చాలా అరుదైన విషయం అని వెస్ట్రన్ ఇల్లినోయి యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రెయిన్ పీర్ చెప్పారు. ఆయన అమెరికాలో నార్తర్న్ కార్డినల్స్‌లో ఉండే ఉభయ లింగత్వం గురించి సర్వే చేశారు. అయితే, ఈ విషయం చాలా పక్షుల్లో గుర్తించడం కూడా జరగదు' అని ఆయన అన్నారు.
కణాలలో అసమ విభజన జరిగినప్పుడు ఈ పరిణామం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. జేమీ హిల్ గత 48 ఏళ్లుగా పక్షులపై అధ్యయనం చేస్తున్నారు. 'ఒక అండం దానితో కలిసి ఉండే పోలార్ శరీరం వేరే వీర్యంతో ఫలదీకరణం చెందుతాయి. అలా పుట్టినప్పుడు ఆడ, మగ లక్షణాలతో జన్మిస్తారు' అని ఆయన చెప్పారు.
'ఈ ప్రాంతంలో ఇలా కనిపించిన పక్షి ఇది మొదటిది కాదని. ఇలాంటి పక్షిని 2019లో ఒక జంట కనిపెట్టారని నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ తెలిపింది. అదే కార్డినల్ పక్షి తిరిగి కనిపించిందేమో!' అని హిల్ అన్నారు.
ఉత్తర అమెరికాలో నార్తర్న్ కార్డినల్స్ చాలా సాధారణ ఫీడర్ పక్షులని ప్రొఫెసర్ పీర్ చెప్పారు. ఆడ, మగ పక్షులు చూడడానికి భిన్నంగా ఉండటం వలన గ్యాన్డ్రోమోర్ఫ్ రకాన్ని కనిపెట్టడం చాలా సులభమైన పనని ఆయన అంటారు.










