హైదరాబాద్: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని చంపాలని చూశారని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ...''అయినప్పటికీ దేవుడి దయ వల్ల బతికి బయట పడ్డాడు. ఇలాంటి హత్య రాజకీయాలు సహించము. హిసంత్మక చర్యలు ఎవరు చేసిన సహించేది లేదు. ప్రతీపక్ష శక్తులు ఎన్నో ఉంటాయి. హేయమైన దాడులకు తగిన బుద్ది చెబుతాం'' అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
మంగళవారం పలు పార్టీల్లోని కీలక నేతలు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారిలో.. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ నేత రాంపుల్లారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్‌రెడ్డి తదితర నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయా నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ''ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. అందర్నీ కలుపుకొని పొండి. తెలంగాణ అభివృద్ది వేగంగా జరుగుతుంది'' అని సీఎం కేసీఆర్ తెలిపారు.










