Sep 21,2023 17:03

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఈ వారం నెటిజన్లను అలరించడానికి ఏ చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్నాయో తెలుసుకుందామా..!

గాండీవధారి అర్జున
మెగా హీరో వరుణ్‌తేజ్‌ నటించిన చిత్రం 'గాండీవధారి అర్జున'. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలైంది. హీరోయిన్‌గా సాక్షి వైద్య, నటుడు వినరురారు తదితర నటీనటులు నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైనా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో ఈ చిత్రం నెలరోజుల కంటే ముందే ఓటీటీ బాట పట్టింది. సెప్టెంబర్‌ 24వ తేదీన నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

dulkar salman


కింగ్‌ ఆఫ్‌ కొత్త

తెలుగులో 'మహానటి' చిత్రంతో హీరో దుల్కర్‌ సల్మాన్‌ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత 'కనులు కనులు దోచాయంటే', 'సీతారామం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ఆయన నటించిన చిత్రం 'కింగ్‌ ఆఫ్‌ కొత్త'. దర్శకుడు అభిలాష్‌ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 24వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. దీంతో ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబర్‌ 22 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

jaane jaan


జానే జాన్‌
ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ నటించిన తాజా చిత్రం 'జానే జానే'. జపనీస్‌ నవల 'ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' ఆధారంగా దర్శకుడు సుజరు ఘోష్‌ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖైదీప్‌, విజరువర్మ వంటి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 21వ తేదీ స్ట్రీమింగ్‌ కానుంది.