ఆస్ట్రేలియా మహిళల సంచలనం
ఐర్లాండ్‌పై 10వికెట్ల తేడాతో గెలుపు
పోర్ట్చ్‌స్ట్రోమ్: ఐర్లాండ్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్ నిర్దేశించిన 218పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఓపెనర్లే ఛేదించారు. లిచ్‌ఫెల్డ్(106), సథర్లాండ్(109) అజేయ సెంచరీలతో కదం తొక్కారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 49ఓవర్లలో 217పరుగులకు ఆలౌటైంది. ప్రెండెగ్వెస్ట్(71) అర్ధసెంచరీతో రాణించగా.. కిమ్ గ్రాత్, గార్డినర్‌కు మూడేసి వికెట్లు దక్క్కాయి. ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మహిళలు 35.5ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 221పరుగులు చేసి గెలిచింది.










