Jul 21,2023 10:45

ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌తో ప్రారంభమైన రెండోటెస్ట్‌లోనూ భారత ఓపెనర్లు కదం తొక్కారు. డొమినికా వేదికగా జరిగిన తొలిటెస్ట్‌లో జైస్వాల్‌, రోహిత్‌ శర్మ కలిసి తొలి వికెట్‌కు 229పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. గురువారం నుంచి ప్రారంభమైన రెండో టెస్ట్‌లో కడపటి వార్తలందే సమయానికి 15ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 70పరుగులు చేసింది. ఆ సమయానికి క్రీజ్‌లో రోహిత్‌ శర్మ(26), జైస్వాల్‌(22) ఉన్నారు.
కోహ్లి ' 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు
టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఓ మైలురాయికి చేరాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు పూర్తిచేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లలో కలిసి 500కు పైగా మ్యాచ్‌లు ఆడిన భారత్‌ తరఫున 3వ, ఓవరాల్‌గా 10వ ఆటగానిగా కోహ్లి ఈ మైలురాయిని అందుకున్నాడు. కోహ్లి కంటే ముందు 500కు పైగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో సచిన్‌, ఎంఎస్‌ ధోనీ, రాహుల్‌ ద్రావిడ్‌ ముందున్నారు. అంతర్జాతీయంగా 500కు పైగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు.. సచిన్‌(664), జయవర్ధనే(652), సంగక్కర(594), జయసూరియ(586), రికీ పాంటింగ్‌(560), ఎంఎస్‌ ధోనీ(538), షాహిద్‌ అఫ్రిది(524), జాక్‌ కల్లిస్‌(519), రాహుల్‌ ద్రావిడ్‌(509), విరాట్‌ కోహ్లి(500) కంటే ముందున్నారు.