టీమిండియా, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా 164 పరుగులు చేసింది. అమెరికా లోని లాడర్ హిల్‌లో ఇక్కడి సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, 3 ఓవర్లలోపే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరడంతో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యశస్వి జైస్వాల్ 5, శుభ్ మాన్ గిల్ 9 పరుగులు చేశారు. నాలుగో టీ20లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేసిన ఈ జోడీ... నేటి మ్యాచ్ లో విండీస్ స్పిన్నర్ అకీల్ హౌసీన్‌కు వికెట్లు అప్పగించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 45 బంతుల్లో 61, తిలక్ వర్మ 18 బంతుల్లో 27 పరుగులతో రాణించిన వీరి తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన సంజుశాంసన్ 9 బంతుల్లో 13 పరుగులు, హర్ధిక్ పాండ్యా 18 బంతులో 13 పరుగులు ఘోరంగా విఫలమయ్యారు., అర్ష్‌దీప్ సింగ్ 8, కుల్‌దీప్ యాదవ్ 0, చహల్ 1 పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తుండగా వర్షం పడటంతో మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు.










