Oct 18,2023 21:57

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విజయదశమి సందర్భంగా ఈ నెల 24న సాధారణ సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి జిఓ 2047ను బుధవారం జారీ చేశారు. ఈ నెల 24వ తేదీని గతంలో ఐచ్ఛిక సెలవు (ఒహెచ్‌)గా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు సాధారణ సెలవుగా ప్రకటించింది.