బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత మహిళలజట్టుకు తొలి వన్డేలో ఓటమి ఎదురైంది. ఢాకా వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత్‌పై బంగ్లాదేశ్ మహిళలజట్టు డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిపై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 43ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నిగర్ సుల్తానా(39), ఫర్గానా హక్(27) రాణించారు. భారత బౌలర్లలో అమన్‌జోత్ కౌర్‌కు నాలుగు, దేవికా వైద్యకు రెండు, దీప్తి శర్మకు ఒక వికెట్ దక్కాయి. ఛేదనలో భారతజట్టు 35.5ఓవర్లలో 113పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ స్మృ మంధాన(11), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(5) స్వల్ప స్కోర్‌లకే పెవీలియన్‌కు చేరారు. దీప్తి శర్మ(20) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో మరుఫా అక్తర్(4/29), రెబయా ఖాన్(3/30), నహిదా అక్తర్, సుల్తానా చెరో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరుఫా అక్తర్‌కు లభించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లా 1-0 ఆధిక్యంలో నిలువగా.. రెండో వన్డే మ్యాచ్ జులై 19న జరగనుంది.










