న్యూఢిల్లీ : దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ బస్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సోమవారం ఆవిష్కరించింది. ఇండియా గేట్ వద్ద కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రెండు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. పునరుత్పాదక వనరులతో నడిచే ఈ బస్సులు ట్రయల్ రన్‌లో భాగంగా దేశ రాజధాని ప్రాంతంలో తిరుగుతాయి. ఒక బస్సులో 30 కిలోల సామర్థ్యం ఉన్న 4 సిలిండర్లు ఉంటాయి. వీటితో బస్సు సుమారు 350 కిమీ దూరం ప్రయాణం చేయగలదు.










