ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు మల్లికార్జున, రాజు డిమాండ్ చేశారు. శనివారం ఆదోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డుపై డిఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మణిపూర్ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఘర్షణలు నియంత్రించడంలో విఫలం చెందిన మణినూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఢణాపురం ఉదరు, నాయకులు సురేష్, హరి, కృష్ణ గోపాల్, రాము, పవన్, నాగప్ప, శాంతప్ప పాల్గొన్నారు.










