Sep 03,2023 15:49

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని బి పప్పూరు గురుకుల పాఠశాలలో ఏదాడి క్రితం 13 ల్యాప్‌టాప్స్‌. 5 ట్యాబులు చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి, ఎమ్మార్పీఎస్‌, సిపిఐ నాయకులు ఆదివారం పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఏదాడి గడుస్తున్నా ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. గతంలో ఉన్న ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరులు పై చర్యలు తీసుకొని పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నా సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని నిరసన కారులకు నచ్చచెప్పారు. కేసును త్వరితగతిన విచారణ చేసి దొంగలను పట్టు కొంటామని తెలపడంతో నాయకులు ధర్నాను విమరించారు.