పాకిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు
ఎసిసి ఎమర్జింగ్ ఆసియాకప్:
కొలంబో: ఎసిసి ఎమర్జింగ్ ఆసియాకప్‌లో భారత్-ఎ జట్టు పాకిస్తాన్-ఎపై ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన గ్రూప్‌ాబి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్‌ాఎ జట్టు 8వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ాఎ జట్టు 48ఓవర్లలో 205పరుగులకు ఆలౌట్ చేసింది. హంగగ్రేకర్(5/42), మానవ్(3/36) బౌలింగ్‌లో మెరిసారు. పాక్ జట్టులో ఖాసిం అక్రమ్(48), ఫర్హాన్(35) టాప్ స్కోరర్స్. ఛేదనలో భారత్-ఎ ఓపెనర్ సాయి సుదర్శన్(104నాటౌట్; 110బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సర్లు), నికిన్ జోస్(53), బ్యాటింగ్‌లో రాణించారు. అభిషేక్ శర్మ(20) బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. దీంతో గ్రూప్-ఎలో భారత్ 6పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సాయి సుదర్శన్‌కు లభించింది. దీంతో ఈ గ్రూప్ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్‌కు చేరగా.. గ్రూప్‌ాఎలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్‌కు చేరాయి. శుక్రవారం జరిగే సెమీస్‌లో భారతజట్టు బంగ్లాదేశ్‌తో, పాకిస్తాన్ జట్టు శ్రీలంకతో తలపడనున్నాయి.
పాయింట్ల పట్టిక
గ్రూప్-ఎ మ్యా గె ఓ పా నె.ర.
శ్రీలంకాఎ 3 2 1 4 +1.69
బంగ్లాదేశ్-ఎ 3 2 1 4 +1.26
ఆఫ్ఘనిస్తాన్-ఎ 3 2 1 3 +0.44
ఓమన్-ఎ 3 0 3 0 -3.24
గ్రూప్-బి
ఇండియా-ఎ 3 3 0 6 +2.92
పాకిస్తాన్-ఎ 3 2 1 4 +1.47
నేపాల్-ఎ 3 1 2 2 -0.75
యుఎఇ-ఎ 3 0 3 0 -3.45










