యలమంచిలి (పశ్చిమ గోదావరి) : యలమంచిలి మండలం చించినాడ గ్రామంలోని పేదల భూముల్లో ఇసుక తవ్వకాలను ఆపాలని డిమాండ్ చేస్తూ ... సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో లంక భూముల పోరాటం ప్రారంభమయ్యింది. నేతలు మాట్లాడుతూ ... గోదావరి పెరుగలంక భూముల్లో ప్రభుత్వం చేపట్టిని చట్ట విరుద్ధ ఇసుక తవ్వకాలను ఆపాలని కోరారు. పేదల హక్కులు, పర్యావరణం, జిఒ లను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులతో కలసి మద్దతుగా పాలకొల్లు ఎం ఎల్ ఏ నిమ్మల రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.










