Aug 01,2023 21:09
  • టి20ల సిరీస్‌కు జట్టును ప్రకటించిన కరేబియన్‌ బోర్డు

గయానా: భారత్‌తో జరిగే ఐదు టి20ల సిరీస్‌కు జట్టును వెస్టిండీస్‌ క్రికెట్‌బోర్డు 15మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించింది. వన్డే జట్టు కెప్టెన్‌ షారు హోప్‌కు మళ్లీ టి20 సిరీస్‌కు ఎంపిక చేసింది. రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాడు. దాంతో, ఫామ్‌లో ఉన్న అతడిని టి20 సిరీస్‌లో కూడా ఆడించాలని అనుకున్నట్లు సెలెక్టర్లు తెలిపారు. దీంతో ఏడాది తర్వాత వెస్టిండీస్‌ తరఫున హోప్‌ టి20ల్లో ఆడనున్నాడు. హోప్‌తో పాటు విధ్వంసక ఆటగాళ్లు షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌, నికోలస్‌ పూరన్‌లు కూడా జట్టులోకి వచ్చారు. టి20 జట్టుకు రొవన్‌ పావెల్‌ సారథ్యం వహించనుండగా.. ఇరుజట్ల మధ్య ఆగస్టు 13 నుంచి ఐదు టి20ల సిరీస్‌ ప్రారంభం కానుంది.
జట్టు : రోవన్‌ పావెల్‌(కెప్టెన్‌), కైల్‌ మేయర్స్‌(వికెట్‌ కీపర్‌), జాన్సన్‌ చార్లెస్‌, రోస్టన్‌ ఛేజ్‌, షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌, జేసన్‌ హోల్డర్‌, షారు హోప్‌, అకేల హోసెన్‌, అల్జారీ జోసెఫ్‌, బ్రాండన్‌ కిగ్‌, ఒబెడ్‌ మెక్‌కారు, నికోలస్‌ పూరన్‌, రొమరియో షెఫర్డ్‌, ఒడియన్‌ స్మిత్‌, ఒషానే థామస్‌.