ప్రజాశక్తి-ఆదోని :ఆదోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని 6,292 చదరపు గజాల ఖాళీ స్థలం 15 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ మహ్మద్ రఫీ శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apsrtc.ap.gov.in వెబ్‌జైట్ నుంచి ఫారం డౌన్ లోడ్ చేసుకొని 27న 2 గంటల లోపు కడప ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఆఫీసులో సమర్పించాలన్నారు. 16న ఆదోని ఆర్టీసీ గ్యారేజ్‌లో జరిగే ఫ్రీబిడ్ సదస్సుకు హాజరు కావాలన్నారు.










