Oct 31,2023 11:48

ఆమదాలవలస (శ్రీకాకుళం) : నవంబర్‌ 1వ తేదీన ఆమదాలవలస నియోజకవర్గంలో నిర్వహించాల్సిన టిడిపి ' నిజం గెలవాలి ' కార్యక్రమం తాత్కాలికంగా రద్దయింది. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మఅతి చెందిన ఆమదాలవలస బూర్జ మండలంకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పరామర్శించాల్సి ఉన్నప్పటికీ ఈరోజు హైకోర్టులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నియోజకవర్గంలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. ఈ సమావేశంలో టిడిపి ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ దామచర్ల సత్య, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, సనపల డిల్లేశ్వరరావు, తంగి గురయ్య, నాగళ్ళ మురళీధర్‌, గొండు రవి, తదితరులు పాల్గొన్నారు.