ఏలూరు : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ... ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా చేపట్టారు. 12వ పిఆర్‌సి ప్రకటించాలని, సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు డిఏలను ప్రకటించాలని, ఇతర ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.










