Oct 24,2023 14:24

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టనున్న 'నిజం గెలవాలి' యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ యాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన బస్సును ఇప్పటికే సిద్ధం చేశారు. బస్సుపై ఎన్టీఆర్‌, చంద్రబాబు, భువనేశ్వరి ఫొటోలతో కూడిన థీమ్‌ను తీర్చిదిద్దారు.చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో చనిపోయిన టిడిపి కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. 'నిజం గెలవాలి' యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు.