Nov 01,2023 08:09

ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : మద్దికేర మండల కేంద్రం ఎడవల్లి గ్రామపంచాయతీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు మంగళవారం మధ్యంతర బెయిల్‌ రావడంతో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు మాట్లాడుతూ ... చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులో ఎలాంటి ఆధారాలు లేనందువల్లే కడిగిన ముత్యంలా బయటికి వచ్చారని అన్నారు. అనంతరం చంద్రబాబుకు బెయిలు రావడంతో ప్రజాస్వామ్యంలో న్యాయం గెలిచిందని టిడిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు నంది జయరాముడు, ఆకుల ఆనందు, నంది మల్లికార్జున, జయన్న, బాలప్ప, వెంకటరాముడు, లాలు సాహెబ్‌, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.