ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేశారని రాష్ట్రంలో సైకో పాలన పోవాలని తిరుపతి-కరకంబాడి మార్గంలోని రవాణా శాఖ కార్యాలయ కూడలిలో సోమవారం టిడిపి శ్రేణులు, జనసేన యువత కలసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఏడు గంటల నుండి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు రాష్ట్రంలో సైకో పాలన పోవాలనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకో పాలన పోవాలని నినదిస్తూ కరపత్రాలను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ టీడీపీ ఇన్చార్జి ఈశ్వరయ్య, గోపీనాథ్, భాస్కర్ రెడ్డి, గోవిందరాజులు, సురేష్, సుబ్బు యాదవ్, చంద్ర, సుధాకర్, జనసేన యువత పాల్గొన్నారు.










