ప్రజాశక్తి - గుత్తి : గుత్తి మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు, పంచాయతీ వార్డు సభ్యుడు వడ్డే అంజినయ్య (60) శనివారం గుండెపోటుతో మరణించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గ్రామంలోని 4వ వార్డుకు టిడిపి మద్దతుతో అంజినయ్య వైసిపి అభ్యర్థిపై పంచాయతీ సభ్యులుగా గెలుపొందారు. శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లిన ఆయన ఇంటికి వచ్చి తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తను టీవీలో చూస్తూ కుప్పకూలి పోయి గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మఅతి పట్ల టిడిపి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.










